27, మే 2019, సోమవారం

Kavitha TRS Losses Election after Press meet at Nizamabad || ఓడిన హుందాగ...

నిజామాబాద్ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి అర‌వింద్‌పై ఘోర ప‌రాజ‌య‌మైన సీఎం కుమార్తె, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత త‌న ఓట‌మిపై స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. గెలిచినవారు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. తాను ఓడిపోయినంతమాత్రాన నిజామాబాద్‌ను వదలనని...కార్యకర్తలు అధైర్యపడొద్దని కవిత చెప్పుకొచ్చారు. కాగా నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కవిత భవిష్యత్తు ఏమిటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


అయితే హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల బరిలో కవిత నిలుస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఆ ప్రచారాన్ని కవిత ఖండించినట్టుగా తెలుస్తోంది. తాను నిజామాబాద్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని.. బంగారు తెలంగాణయే తన లక్ష్యమని కవిత అన్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కవిత మళ్లీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వరకు ఎదురుచూస్తారా లేక ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యురాలిగా పోటీ చేస్తారా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. కవితను ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి